కావలసిన పదార్థాలు:
బ్రెడ్ స్లైసెస్ - ఆరు
కోవా - 3 స్పూన్ల్
డ్రైఫ్రూట్స్ - 2 స్పూన్స్
చక్కెర - 1 స్పూన్
యాలకుల పొడి - పావు స్పూన్
నెయ్యి - వేయించడానికి సరిపడా
పాకం కోసం - చక్కెర
నీళ్లు - అరకప్పు
తయారీ విధానం:
ముందుగా చక్కెర పాకం చేసి పెట్టుకోవాలి. ఇందుకోసం ఓ గిన్నెలో నీళ్లు, చక్కెర తీసుకుని స్టవ్ మీద పెట్టాలి. తీగపాకం వచ్చేవరకు ఉంచి ఆ తరువాత దింపేయాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసులు అంచుల్ని తీసేసి ఒక్కోదానిపై కొద్దిగా నీళ్లు చల్లి అప్పడాల కర్రతో వత్తినట్లు చేసి ఓ పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో కోవా, డ్రైఫ్రూట్స్ పలుకులు, చక్కెర, యాలకుల పొడి తీసుకుని చెంచా నీళ్లు చల్లి పిండిలా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని బ్రెడ్ స్ట్లైసు మధ్యలో ఉంచి అంచుల్ని మూసేయాలి. ఆ తరువాత ఉండ వచ్చేలా చేత్తో గట్టిగా నొక్కినట్లు చేసుకోవాలి. అప్పుడే డ్రైఫ్రూట్స్ మిశ్రమం ఇవతలకు రాకుండా ఉంటుంది. ఇలా మిగిలిన స్లైసుల్నీ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నెయ్యి వేడిచేసి ఒక్కో ఉండను వేయించి తీసుకోవాలి. కొద్దిగా వేడి చల్లారాక చక్కెర పాకంలో వేసి 5 నిమిషాల తరువాత తీసేయాలి. అంతే నోరూరించే స్టఫ్‌డ్ గులాబ్‌జామ్ రెడీ.