క్రిస్మస్ స్పెషల్: ఫ్రూట్ కేక్ తయారీ మీ కోసం..
జీసస్ పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్నవారికి సైతం పంపుతుంటారు. క్రిస్మస్ కేకులను
జీసస్ పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ రోజున ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. క్రిస్మస్‌కి కేకులు తయారుచేసి వచ్చిన అతిథులకే కాక దూరాన ఉన్నవారికి సైతం పంపుతుంటారు. క్రిస్మస్ కేకులను భారీగా షాపుల్లో కొనేసేవారు కొందరుంటే మరి కొందరు ఇంట్లోనే తయారు చేసుకుంటారు. అలాంటి వారు మీరైతే ఫ్రూట్ కేక్ ఎలా చేయాలో తెలుసుకోండి.
కావలసిన పదార్థాలు :
ఎండు ద్రాక్ష - ఒకటిన్నర కప్పు
ఖర్జూర పండ్లు - ఒకటిన్నర కప్పు
జీడిపప్పు - అర కప్పు
జాజికాయ పొడి - అర టీ స్పూన్
బేకింగ్ పౌడర్ - ఒక టీ స్పూన్
వెన్నిలా ఎసెన్స్ - పది డ్రాప్స్
బటర్ - ఒక కప్పు
పంచదార - ఒకటిన్నర కప్పు
కోడిగుడ్లు - ఐదు
మైదా - నాలుగు కప్పులు
తేనె- అర కప్పు
తయారీ విధానం:
ఎండు ద్రాక్షలను, ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. జీడిపప్పును పేస్ట్ చేసుకుని పక్కనబెట్టుకోవాలి. కోడిగుడ్డులోని తెల్ల, పసుపు సొనల్ని వేర్వేరుగా గిలకొట్టి పక్కనబెట్టుకోవాలి. పంచదార, వెన్నను బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో కొంచెం కొంచెం బేకింగ్ పౌడర్ వేస్తూ గిలకొట్టాలి.
ఈ మిశ్రమాలను మైదాపిండితో చేర్చి బాగా గిలకొట్టాలి. ముందుగా తెల్లసొన కలిపి గిలకొట్టాలి. ఆపై పసుపు సొనను చేర్చి గిలకొట్టాలి. ఆపై నట్స్‌ను అందులో చేర్చాలి. ఇందులో ఎసెన్స్, జాజికాయ పౌడర్ చేర్చుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన టిన్‌లలో ఉంచి బేక్ చేయాలి.