"సేమియా లడ్డు"తో సంక్రాంతి సంబరాలు..!
కావలసిన పదార్థాలు :సేమియా.. నాలుగు కప్పులుపంచదార.. ఒక కప్పునెయ్యి లేదా వనస్పతి... ఒక కప్పుబాదంపప్పు.. పావు కప్పుతయారీ విధానం :ముందుగా సేమియాను కడాయిలో పోసి దోరగా వేయించి దించేయాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పంచదారను కూడా మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ రెండు మిశ్రమాలను ఒక పాత్రలో వేసి నెయ్యి లేదా వనస్పతిని కాచి వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమంపై పోయాలి.బాదంపప్పును కూడా వేయించి కాస్త పలుకులుగా ఉండేలా దంచి ఇందులో వేయాలి. ఈ మిశ్రమాన్నంతటినీ బాగా కలిపి, కావాల్సిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే రుచికరమైన, నోరూరించే సేమియా లడ్డూలు రెడీ అయినట్లే. సులభంగా తయారయ్యే ఈ లడ్డూలతో సంక్రాంతి సంబరాలను తియ్యతియ్యగా జరుపుకుంటారు కదూ..?!