శనగపిండి స్పెషల్ "ఇంద్రకిరణ్ స్వీట్"
కావలసిన పదార్థాలు :శనగపిండి.. ఒక కప్పుపాలు.. ఒక కప్పునూనె లేదా నెయ్యి.. ఒక కప్పుకొబ్బరితురుము.. ఒక కప్పుపంచదార.. 3 కప్పులుయాలకుల పొడి.. ఒక టీ.తయారీ విధానం :ఒక గిన్నెలో పైన చెప్పుకున్న పదార్థాలన్నింటినీ వేసి బాగా కలియబెట్టాలి. ఉండ కట్టకుండా ఈ మిశ్రమాన్ని ఒకసారి మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. మందపాటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి స్టౌమీద ఉంచాలి. గరిటెతో కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం బాగా దగ్గరపడి.. పాత్ర నుంచి విడిపడేలా అవుతున్నప్పుడు, నెయ్యి రాసిన పళ్లెంలో పోయాలి.ఇది వేడిగా ఉన్నప్పుడే కావాల్సిన సైజులో ముక్కలుగా కోయాలి. అంతే ఇంద్రకిరణ్ స్వీట్ తయార్..! చాలా సులభంగా తయారు చేయగలిగే ఈ ఇంద్రకిరణ్ స్వీట్ పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరూ ట్రై చేసి చూస్తారు కదూ..?