కావలసిన పదార్థాలు :
మైదా పిండి.. ఒక కప్పు
శనగ పిండి, చక్కెర.. చెరో కప్పు
ఎల్లో ఫుడ్‌కలర్.. అర టీ.
నెయ్యి.. ఒకటిన్నర కప్పు
జీడిపప్పు, బాదం ముక్కలు.. రెండు టీ.
తయారు చేసే విధానం :
మైదాపిండిని ముందురోజు రాత్రే నీటిలో గట్టిగా, పొడిపొడిగా కలిపి ఉంచాలి. శనగపిండిని సువాసన వచ్చేవరకూ వేయించాలి. అడుగు మందంగా వుండే పాత్రలో చక్కర వేసి నీరుపోసి తీగపాకం రానివ్వాలి. మైదాపిండి, వేయించిపెట్టుకున్న శనగపిండి అందులో పోసి, కలుపుతూవుండాలి.
గట్టిపడ్డాక నెయ్యి, ఎల్లో ఫుడ్‌కలర్ వేసి మరోసారి కలపాలి. జీడిపప్పులు, బాదం ముక్కల్ని ఒక పళ్లెంలో పరచి.. వాటిమీద పై ఉడుకుతున్న మిశ్రమాన్ని తీసి పోయాలి. చల్లారాక ముక్కలుగా చేయాలి. అంతే బాంబే హల్వా సిద్ధం..!