కావలసిన పదార్థాలు :
బియ్యం... నాలుగు కప్పులు
పాలు... రెండు కప్పులు
మామిడిపండు గుజ్జు... రెండు కప్పులు
బాదంపప్పు... రెండు టీ.
పిస్తాపప్పు... రెండు టీ.
యాలక్కాయలపొడి... ఒక టీ.
పంచదార... రెండు కప్పులు
తయారీ విధానం :
బియ్యాన్ని కడిగి నానబెట్టాలి. నీళ్లు లేకుండా వడగట్టి, కాసేపు ఆరబెట్టాలి. ఆ తరువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో పాలు పోసి కాగిన తరువాత అందులో పంచదార కలపాలి. దాంట్లోనే కొద్దిగా నీటిని కలిపి, బియ్యంపిండిని పోసి కలుపుతూ ఉడికించాలి.
ఇప్పుడు మామిడిపండు గుజ్జును ఉడుకుతున్న మిశ్రమంలో కలిపి, చిక్కగా అయ్యాక యాలక్కాయలపొడి వేయాలి. చల్లారిన తరువాత ఈ మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసి... బాదంపప్పు, పిస్తాపప్పులతో అలంకరించి ఐస్ క్యూబ్స్ కలిపి, చల్లగా సర్వ్ చేయాలి.