మిల్క్ విత్ బ్రెడ్ స్వీట్ ఎలా చేయాలి?
బ్రెడ్.. పాలు, కోడిగుడ్లు, ఈస్ట్ తీసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు. పిల్లలకు ఆరోగ్యాన్నిచ్చే పాలు బ్రెడ్‌తో స్వీట్ చేస్తే ఎలా ఉంటుందో ట్రై చేద్దామా.. కావలసిన పదార్థాలు:బ్రెడ్ - 10 ముక్కలు. పాలు - 3 కప్పులు. జీడిపప్పు - తగినన్ని. ద్రాక్ష - తగినన్ని. ఏలకులపొడి - ఒక స్పూను. చక్కెర - రెండు కప్పులు . తయారీ విధానం:ముందుగా చక్కెరలో అర కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు వేడి చేయాలి. వేరొక గిన్నెలో పాలు ఒక కప్పు అయ్యేంత వరకు మరగనివ్వాలి. బ్రెడ్ ముక్కల్ని పెనం మీద నెయ్యి వేసి రెండు వైపులా వేయించాలి. మరొక పెద్ద గిన్నెలో పది బ్రెడ్ ముక్కలని పక్క పక్కన పేర్చి వాటిపై పైన తయారు చేసిన చక్కెర పాకం మరియు పాలు ఓకేరకంగా పొయ్యాలి. పైన జీడిపప్పు, ద్రాక్ష, ఏలకుల పొడి చల్లితే మిల్క్ విత్ బ్రెడ్ స్వీట్ రెడీ.