పచ్చిమినుములు : అరకిలో
పంచదార : పావుకిలో
నెయ్యి : పావుకిలో
ఇలా చెయ్యాలి :
ఖాళీ బూరెల మూకుడులో మినుములను దోరగా వేయించి, చల్లారిన తర్వాత విసిరి, చెరిగి పొట్టును వేరుచేయాలి. పంచదారను కూడా మెత్తగా విసరాలి. నెయ్యిని కాచి అందులో పిండి, విసిరిన పంచదారలను వేసి బాగా కలియబెట్టండి. తర్వాత కావలసిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఇవి వారంరోజులపాటు నిలువ ఉంటాయి.