బ్రెడ్ రసగుల్లా ఎలా చేయాలో తెలుసా..!?
, సోమవారం, 14 నవంబరు 2011 (13:13 IST)
కావాల్సిన పదార్థాలు: బ్రెడ్‌ప్యాకెట్ - ఒకటి, పంచదార - రెండు కప్పులు, నెయ్యి - పావుకప్పు, యాలకుల పొడి - చెంచా.తయారీ విధానం: బ్రెడ్ ముక్కల అంచులు తొలగించి.. వాటిపై కాసిని నీళ్లు పోయాలి. ఆ తరవాత మెత్తగా చేసి పక్కనపెట్టాలి. అరగంటయ్యాక అందులో యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి. పెనంపై నెయ్యిని కరిగించి ఆ ఉండల్ని దోరగా కాల్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి అడుగున్న గిన్నెలో పంచదార తీసుకొని తగినన్ని నీళ్లు కలిపి పొయ్యి మీదపెట్టాలి. పాకం సిద్ధమయ్యాక అందులో సిద్ధం చేసి పెట్టుకున్న ఉండల్ని వేస్తే బ్రెడ్ రసగుల్లా సిద్ధమయినట్టే. ఈ రసగుల్లాను చెర్రీ పండ్లతో సర్వ్ చేస్తే మీ అతిథులు సూపర్ టేస్ట్ అంటారు..!