బ్రెడ్, చపాతీలతో "టమోటో ఖర్జూరా స్వీట్"
కావలసిన పదార్థాలు : టమోటోలు- అర కిలో, జీరా- 5 గ్రా, కారం- పావు టీస్పూన్, ఎండు ఖర్జూరం- 50 గ్రా, కిస్మిస్- 20 గ్రా, పంచదార- 150 గ్రా, ఉప్పు- సరిపడా.తయారీ విధానం : ఒక గిన్నెలో నూనె తగినంత పోసి దాంట్లో జీరా వేసి, టమోటో ముక్కలు, కారం, ఉప్పు వేసి ఉడికి గట్టిపడేంతదాకా ఉడికించాలి. నానబెట్టిన ఖర్జూరాలు, టమోటోలను కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లాగా చేయాలి. ఆ పేస్టును ఉడికించి గట్టిగా గుజ్జు అయిన తరువాత పంచదార కలిపాలి. ఇది గట్టిపడి పేస్ట్‌లాగా మారగానే పై మిశ్రమాన్ని దించి చల్లార్చి సర్వ్ చేయాలి. దీనిని బ్రెడ్తోగానీ, చపాతీలోగానీ సైడ్‌డిష్‌గా తీసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది కూడా.