కావలసిన పదార్థాలు :
శెనగపప్పు - 100 గ్రాములు, బ్రెడ్ స్లైసులు - ఆరు, బెల్లం - పావు కిలో, కొబ్బరి - పావు చిప్ప, ఏలక్కాయలు - ఐదు, నెయ్యి - 50 గ్రాములు.
తయారు చేయు విధానం :
ముందుగా శెనగపప్పని కాస్త ఉడకపెట్టి నీళ్లు తీసేసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బి అందులో నెయ్యి వేసి కలిపి పెట్టుకోవాలి. కొబ్బరి చిప్పను కోరి దానిని కాస్త నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. బ్రెడ్ స్లైసులను కూడా మిక్సీలో వేసి కాస్త తిప్పి కరకరలాడుతుండగా నెయ్యిలో వేసి వేయించాలి.
బెల్లాన్ని శుభ్రం చేసి అందులో కాసిన్ని నీళ్లు పోసి కరిగించి స్టవ్ మీద పెట్టాలి. బెల్లం పాకం పడుతున్న సమయంలో ఇందులో నూరి పెట్టుకున్న శెనగపప్పును వేసి బ్రెడ్ స్లైసులు, కొబ్బరి వేయాలి. ఇందులో ముక్కలు చేసిన ఏలక్కాయ, నెయ్యిలను వేసి తిప్పాలి. దీనిని దించి ఆరాక చిన్న ఉండలుగా చేసి సర్వ చేయాలి.