బూందీ పాయసం తయారు చేయడం ఏలా?
, శుక్రవారం, 28 డిశెంబరు 2012 (18:09 IST)
పిల్లలు పాయసం అంటే ఇష్టపడతారు. పుట్టిన రోజు పండగలు వస్తే ఆ రోజు పాయసం ఉండాల్సిందే. రోటీన్‌గా ఒట్టి పాయసమే కాకుండా, బూందీ పాయసం ట్రై చేయండి. కావల్సిన పదార్థాలు : సెనగపిండి- అరగ్లాసునూనె- వేయించడానికి సరిపడాఉప్పు- కొద్దిగా పంచదార- పావుకేజీయాలకుల పొడి- అరచెంచాపాలు - లీటరు కన్నా కొద్దిగా ఎక్కువ, నేతిలో వెయించిన జీడిపప్పు పలుకులు- కొన్నిమొక్క జొన్న పిండి- మూడు చెంచాలువంటసోడా- చిటికెడుతయారీ: సెనగపిండిలో చిటికెడు ఉప్పు, వంటసోడా వేసి నీళ్ళతో గరిటెజారుగా కలుపు కోవాలి. బాణిలిలో నూనె వేడిచేసి చిల్లుల వేస్తే బూందీ వస్తుంది. వేగాక తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు లీటరు పాలు మరిగించి పంచదార వేయాలి. అది కరిగాక బూందీని చేర్చాలి. ఐదారు నిమిషాలయ్యాక యాలకులు పొడి, జీడిపప్పు పలుకులు వేయాలి. మిగిలిన పాలల్లో మొక్కజొన్న పిండి కలిపి పాయసానికి చేర్చాలి. మిశ్రమం చిక్కగా అయ్యాక దింపేసి చిటికెడు ఉప్పు వేస్తే చాలు. కమ్మని బూందీ పాయసం తయారైనట్లే...