"పెసరపప్పు పాయసం" సాయంత్రపు అల్పాహారం..!
కావలసిన పదార్థాలు :పెసరపప్పు... రెండు కప్పులుపంచదార.. రెండు కప్పులుపాలు.. రెండు లీ.నెయ్యి.. ఒక టీ.ఎండుద్రాక్ష.. అర కప్పుయాలకుల పొడి.. కాస్తంతతయారీ విధానం :పెసరపప్పును కడగకుండా చేత్తోనే శుభ్రపరచాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి, సన్నని మంటపై ఉంచి, అందులో పెసరపప్పును దోరగా వేయించాలి. కుక్కర్‌లో అరలీటరు పాలు, వేయించిన పెసరపప్పును కలిపి ఉడికించాలి. ఇప్పుడు మిగిలిన పాలకు పంచదార, వేయించిన ఎండుద్రాక్ష చేర్చి బాగా మరగనివ్వాలి.పాలు సగం అయ్యేవరకు ఉంచాలి. ఇందులో ముందుగా ఉడికించిన పెరసపప్పు మిశ్రమం వేసి, చివరగా యాలకుల పొడి చల్లితే పెసరపప్పు పాయసం తయారైనట్లే...! ఎప్పుడూ పాల పాయసమేనా అంటూ.. పేచీపెట్టే చిన్నారులకు పోషకాలతోపాటు, వెరైటీ రుచిని అందించే పెసరపాయసాన్ని రూచి చూపించండి. ఎప్పుడూ ఇదే కావాలని అడగకపోతే ఒట్టు..! పైగా దీనికి పెద్దగా సమయం కూడా పట్టదు.