Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పిస్తా సంతోష్‌తో అతిథులను ఆకట్టుకోండి

Advertiesment
పిస్తా సంతోష్
FILE
అనుకోకుండా మీ ఇంటికి అతిథులు వచ్చేసారా అయితే పిస్తా సంతోష్ తయారు చేసి అతిథుల వద్ద మంచి మార్కులు కొట్టేయండి. అలాంటి పిస్తా సంతోష్‌ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.

కావలసిన పదార్థాలు :
పన్నీర్ తురుము : 225 గ్రాములు
పంచదార : వంద గ్రాములు
పాలు : ఒక కప్పు
రోజ్ వాటర్ : ఒక కప్పు
ఏలకుల పొడి : అర స్పూన్
పిస్తా : ఒక కప్పు

తయారీ విధానం:
ముందుగా పన్నీర్, పాలు, పంచదారను ఒక పాత్రలో వేసి బాగా కలుపుకోవాలి. గట్టిపడిన ఈ మిశ్రమంలో కాస్త రోజ్ వాటర్, ఏలకుల పొడిని చేర్చాలి. ఒక ప్యాన్‌లో పిస్తా ముక్కలను చల్లి, పన్నీర్, పాలు, పంచదార మిశ్రమాన్ని దానిపై వేసి, కాసేపు ఆరనివ్వాలి. కాసేపయ్యాక ఈ పిస్తా సంతోష్‌ను మీకు ఇష్టమొచ్చిన సైజుల్లో కట్ చేసుకుని సర్వ్ చేయొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu