పిల్లల కోసం వెరైటీ స్వీట్ "సుఖిడీ"
కావలసిన పదార్థాలు :గోధుమపిండి.. ఒక కప్పుబెల్లం తురుము, నెయ్యి.. ముప్పావు కప్పుబాదం, జీడిపప్పు పలుకులు.. అర కప్పుతయారీ విధానం :బాణలిలో కొద్దిగా నెయ్యివేసి గోధుమపిండి, బాదం, జీడిపప్పులను వేయించుకోవాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే బెల్లం తురుమును వేసి కలియబెట్టాలి. తరువాత ప్లేటులో నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని ఉంచి గరిటెతో నున్నగా చేయాలి. ఇప్పుడు ఇష్టమైన ఆకృతిలో ముక్కలుగా చేసి పెట్టుకుంటే రుచికరమైన సుఖిడీ తయార్..!