పచ్చ పచ్చాని రూపంలో "లిల్వా కా హల్వా"
కావలసిన పదార్థాలు :పచ్చిబఠాణీలు... 200 గ్రా.నెయ్యి... వంద గ్రా.పంచదార... 150 గ్రా.పాలు... 60 మి.లీ.కోవా... 75 గ్రా.బాదంపప్పు... 25 గ్రా.పిస్తాపప్పు... 25 గ్రా.తయారీ విధానం :పాలను మరిగించి చల్లార్చాలి. బాదం, పిస్తాపప్పుల్ని సన్నగా కోయాలి. పచ్చి బఠాణీలను ఉడికించి మెత్తగా మెదపాలి. దీన్ని 20 నిమిషాలపాటు, నేతిలో వేయించాక పంచదార వేసి కరగనివ్వాలి. తరువాత మరిగించి చల్లార్చిన పాలను, కోవానూ కూడా బఠాణీ మిశ్రమంలో కలిపి, పాలన్నీ ఆవిరైపోయే వరకూ ఉడికించాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్‌లో సర్ది... బాదం, పిస్తా పప్పులతో అలంకరిస్తే తినడానికే కాదు, చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉండే లిల్వీ కా హల్వా తయారైనట్లే...!