కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... ఒక కప్పు
పంచదార... రెండు కప్పులు
యాలకుల పొడి... ఒక టీ.
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
గోధుమపిండిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి, సరిపడా నీటితో చపాతీ పిండిలా కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటికి నూనె రాస్తూ పూరీల్లా వత్తుకుని, మధ్యలో అర్ధచంద్రాకారంలో కట్ చేయాలి. చివర్లు తెగకుండా పూరీల మధ్యలో కత్తితో పొడుగ్గా గాట్లు పెట్టుకోవాలి.
ఇలా అన్నీ తయారయ్యాక రెండుచేతులతో వడి తిప్పి ఇలాచీ ఆకారంలో చేసుకుని విడిపోకుండా చివర్లు వత్తుకోవాలి. వీటిని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఈలోపు ఒక పాత్రలో పంచదార పాకం తయారు చేసుకుని, యాలకుల పొడి వేసి, వేయించిన పూరీ ఇలాచీలను పాకంలో ముంచి వెంటనే తీసేయాలి. చల్లారాక తింటే చాలా రుచిగా ఉంటాయి.