నోటిలో కరిగిపోయే సేమ్యా లడ్డూలు తయారు చేయడం ఎలా...?
, శుక్రవారం, 29 మార్చి 2013 (17:59 IST)
పిల్లలకు నచ్చే స్వీట్స్ వెరైటీ చేయాలనుందా.. అయితే నోటిలో కరిగిపోయే సేమ్యా లడ్డూలను వెంటనే ట్రై చేయండి. కావలసిన పదార్థాలు :సేమ్యా : కప్పుపంచదార : ముప్పావుకప్పుయాలకులు : మూడునెయ్యి : అరకప్పు జీడిపప్పు : పది తయారు చేసే విధానం : యాలకుల్ని పొడి చేయాలి. బాణిలోని టేబుల్ స్పూను నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కన ఉంచాలి. తరువాత అందులోనే సేమ్యా వేసి బంగారు వర్ణంలోకి మారే వరకూ వేయించాలి. మిక్సీలో పంచదార వేసి పొడి చేయాలి. తరువాత ఈ రెండు పొడులనూ కలపాలి. ఇందులో కరిగించిన నెయ్యి, యాలకుల పొడి వేసి కలిపి లడ్డూల్లా చుట్టి వేయించిన జీడిపప్పుని అతికించాలి. అంతే లడ్డూలు రెడీ..!