నేతి ఘుమఘుమలతో "జీడిపప్పు రవ్వ కేసరి"
కావలసిన పదార్థాలు :రవ్వ... 100 గ్రా.చక్కెర... 500 గ్రా.నెయ్యి... 200 లేదా 300 గ్రా.కేసరిపొడి... తగినంతపచ్చకర్పూరం... తగినంతయాలక్కాయలు... 7 లేక 8జీడిపప్పు... 7 లేక 8తయారీ విధానం :బాణలిలో కొంచెం నెయ్యి వేసి మొదట జీడిపప్పు, ఆ తరువాత రవ్వను వేయించి పెట్టుకోవాలి. ముప్పావు లీటరు నీటిని వేయించిన రవ్వలో కలుపుకొని బాగా ఉడికించాలి. ఉడికేటప్పుడు రవ్వని కలుపుతూ వుండాలి. వుడికిన తరువాత చక్కెర కలపాలి. చక్కెర కలిపిన వెంటనే రవ్వ తిరిగి పలుచగా తయారవుతుంది.ఉడుకుతుండగా కలుపుతూ వుంటే అదే తిరిగి చిక్కబడుతుంది. ఆ తరువాత మిగిలిన నెయ్యి, కేసరిపొడి కలిపి ఉడికించాలి. కేసరి గిన్నెకి అంటుకోకుండా వుండేదాకా అలా కలుపుతూ వుండాలి. తరువాత స్టవ్ మీద నుండి దించి, యాలక్కాయ పొడి, పచ్చ కర్పూరం కలిపి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే జీడిపప్పు రవ్వ కేసరి తయార్..!