కావలసినపదార్థాలు:
తైదపిండి: 1/4 కిలో
బెల్లం: 1/4 కిలో
జీడిపప్పు: 100 గ్రాములు
తురిమిన కొబ్బరి: ఒక కప్పు
ఏలకుల పొడి: ఒక టీ స్పూన్
ఇలా చేయండి:
వేడయిన బాణలిలో మూడు కప్పుల నీటిని పోసీ బాగా మరిగించాలి. ఈ నీటిలో చల్లారిన నీటిలో కలుపుకున్న తైదపిండిని మెల్లమెల్లగా పోస్తూ కలియబెట్టాలి. పిండి చిక్కబడక ముందే బెల్లం ముక్కలను అందులో వేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమంలో పంచదారను కూడా కలుపుకోవచ్చు. పిండి చిక్కబడకముందే అందులో ఏలకుల పొడి, నేతితో వేయించిన జీడిపప్పు ముక్కలు, కొబ్బరి తురుమును వేసి వేడివేడిగా సర్వ్ చేయొచ్చు. ఈ పాయసంను కూల్‌గా తీసుకోవాలని అనుకుంటే ఫ్రిజ్‌లో పదినిమిషాల పాటు ఉంచి తర్వాత తీసి సర్వ్ చేస్తే రుచికరంగా ఉంటుంది.