తియ్యని వాల్నట్ హల్వా ఎలా తయారు చేయాలి!?
, శనివారం, 24 నవంబరు 2012 (13:07 IST)
కావలసిన పదార్థాలు : వాల్ నట్స్ : ఒక కప్పుపంచదార : అరకప్పునెయ్యి : మూడు టేబుల్ స్పూన్లురవ్వ : టేబుల్ స్పూన్యాలకుల పొడి : అర టీ స్పూన్పాలు : కప్పుఅలంకరణకు పావు కప్పు తరిగిన అక్రోట్స్ పప్పులు. తయారీ విధానం :ముందుగా పంచదార, అరకప్పు నీరు కలిపి వేడిచేయాలి. ఈలోగా నాన్‌స్టిక్ మూకుడులో నెయ్యి వేడి చేసి, సన్నని సెగపై రవ్వ వేయించాలి. రవ్వ, వాల్నట్స్ చిదిమి పంచదార పాకంలోవేసి సన్నని సెగపై కలియబెడుతూ ఉడికించాలి. బంగారు రంగులోకి మారే వరకు అంటే 15 నిమిషాల పాటు ఉంచాలి. మిశ్రమం డ్రైగా అయ్యాక పాలుపోసి కలపాలి. సన్నని సెగపై మరో పదినిమిషాలు ఉడికించాలి. దీనికి యాలకుల పొడివేసి మాడిపోకుండా కలియబెట్టాలి. తర్వాత అక్రోట్ పప్పులను వేసి అలంకరిస్తే.. వాల్ నట్స్ హల్వా రెడీ.. ఈ హల్వాను మీ గెస్ట్‌లకు హాట్ హాట్‌గా సర్వ్ చేయొచ్చు.