కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... అరకేజీ
పంచదార.. వంద గ్రా.
నెయ్యి... వంద గ్రా.
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
గోధుమపిండిలో కరిగించిన 50 గ్రాముల నెయ్యి, ఉప్పు కలపాలి. అరగ్లాసు నీళ్లలో పంచదార కలిపి ఈ నీళ్లతో పిండిని తడపాలి. అవసరమైతే ఇంకొన్ని నీళ్లు చల్లి చపాతీ పిండిలా కలపాలి. ఈ పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కోముద్దను చపాతీలా వత్తాలి.
పొయ్యిమీద పెనం పెట్టి సన్నని మంటమీద ఈ చపాతీలను నెయ్యి వేస్తూ కాల్చితీయాలి. ఇవి కాస్త మృదువుగా బిస్కెట్స్లా ఉంటాయి. వీటిని హలీమ్ లేదా చికెన్ కర్రీ లేదా సాస్తోగానీ కలిపి తినవచ్చు. అంతే తియ్యటి నేతి చపాతీలు తయారైనట్లే...! మీరూ ట్రై చేస్తారు కదూ..!!