కావలసిన పదార్థాలు : మినప్పప్పు... రెండు కప్పులు పంచదార... రెండు కప్పులు నెయ్యి... ఒక కప్పు కోవా... ఒక కప్పు డ్రైఫ్రూట్స్... ఒక కప్పు జాజికాయ పొడి... చిటికెడు
తయారీ విధానం : మినప్పప్పును ఒక గంటపాటు నానబెట్టి, తగినంత నీటితో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాణలిలో నెయ్యి వేడిచేసి మినప్పప్పు మిశ్రమాన్ని కలిపి అడుగంటకుండా వేయించాలి. ఈ మిశ్రమంలో నెయ్యి బాగా కలిసిన తరువాత కోవా, పంచదార, డ్రైఫ్రూట్స్ కలిపి సన్నటి మంటమీద మిశ్రమం దగ్గరయ్యేంతదాకా కలుపుతూ ఉండాలి.
చివర్లో జాజికాయ పొడి కలిపి స్టౌ మీది నుంచి దించేయాలి. ఈ మిశ్రమాన్ని ట్రేలో సమానంగా పరచి కావలసిన సైజులో ముక్కలుగా చేసుకోవాలి. అవసరం అనుకునేవారు కాజు, బాదం, పిస్తా ముక్కలతో గార్నిష్ చేసుకుంటే చూసేందుకు అందంగా ఉంటాయి. అంతే డ్రైఫ్రూట్స్ పిన్నీ రెడీ..! ఇవి వారం రోజుల దాకా నిల్వ ఉంటాయి.