కావలసిన పదార్థాలు :
టమోటోలు... అర కిలో
జీర... 5 గ్రాములు
కారం... పావు టీస్పూను
ఎండు ఖర్జూరం... 50 గ్రాములు
కిస్‌మిస్... 20 గ్రాములు
పంచదార... 150 గ్రాములు
ఉప్పు... సరిపడా
తయారీ విధానం :
ఒక గిన్నెలో నూనె తగినంత పోసి దాంట్లో జీరా వేసి, టమోటో ముక్కలు, కారం, ఉప్పు వేసి ఉడికి గట్టిపడేంతదాకా ఉడికించాలి. నానబెట్టిన ఖర్జూరాలు, టమోటోలను కలిపి మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేయాలి. ఆ పేస్టును ఉడికించి గట్టిగా గుజ్జు అయిన తరువాత పంచదార కలిపాలి.
ఇది గట్టిపడి పేస్ట్ లాగా మారగానే పై మిశ్రమాన్ని దించి చల్లార్చి సర్వ్ చేయాలి. దీనిని బ్రెడ్‌తోగానీ, చపాతీలోగానీ సైడ్‌డిష్‌గా తీసుకోవచ్చు, చాలా రుచిగా ఉంటుంది కూడా.