జూనియర్స్ హెల్దీ ఫుడ్ "యాపిల్ కోవా"
కావలసిన పదార్థాలు :సన్నగా తరిగిన యాపిల్ ముక్కలు... ఒక కప్పుపాలు.. ఒక కప్పుజీడిపప్పు.. 15 గ్రా.పంచదార.. ఒక కప్పుపచ్చికోవా.. ఒక కప్పుబాదంపొడి.. అర కప్పుయాలక్కాయలపొడి.. ఒక టీ.నెయ్యి.. తగినంతతయారీ విధానం :ముందుగా నేతిలో జీడిపపప్పు వేయించుకోవాలి. తరువాత పాలు మరిగించాలి. దాంట్లో పచ్చికోవాతో పాటు పంచదార కూడా వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమం బాగా మరుగుతుండగా యాపిల్ ముక్కల్ని వేసి కలియబెట్టాలి. కాసేపు అలాగే ఉడికిన తరువాత బాదంపొడి వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.ఈ మిశ్రమం బాగా దగ్గరయ్యేంతదాకా స్టవ్‌పై అలాగే ఉంచి గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరగా అందులో తగినంత నెయ్యి, యాలకుల పొడి వేసి కలియబెట్టి దించేయాలి. అంతే యాపిల్ కోవా తయారైనట్లే..! వెరైటీగా రుచిగా ఉండే ఈ యాపిల్ కోవాను చిన్నపిల్లలతోపాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి చాలా మంచిది కూడా..!!