Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"చంద్రవంకలు" చేయడం చాలా తేలిక..!

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
పెసరపప్పు.. పావు కేజీ
జీడిపప్పు.. 25 గ్రా.
పచ్చికొబ్బరికోరు... ఒక చిప్పది
చక్కెర.. పావు కేజీ
యాలక్కాయలు.. 25 గ్రా.
పచ్చకర్పూరం.. కాస్తంత

తయారీ విధానం :
పెసరపప్పును మెత్తగా రుబ్బుకుని పచ్చికొబ్బరి కోరు, పంచదార కలిపి స్టౌమీద ఉంచి సుమారు పావుగంటసేపు ఉడికించాలి. ఉడుకుతున్నప్పుడు ఈ మిశ్రమం అడుగంటకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి. పెసరపిండి, కొబ్బరి, పంచదార అన్నీ బాగా ఉడికి గట్టిగా ముద్దలాగా మారిన తరువాత అందులో యాలక్కాయల పొడి, పచ్చకర్పూరం, జీడిపప్పు కలపాలి.

కాసేపటి తరువాత ఈ మిశ్రమాన్ని ఓ గుడ్డపై పోసి కేక్‌ల మాదిరిగా డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. వీటిని బాగా కాగుతున్న నూనెలో బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలికే కదూ..?!

Share this Story:

Follow Webdunia telugu