కావలసిన పదార్థాలు :
పచ్చికోవా... ఒక కేజీ
మైదా... 150 గ్రా.
గులాబీ రంగు... చిటికెడు
వంటసోడా... తగినంత
పంచదార... రెండు కేజీ
రోజ్ ఎసెన్స్... నాలుగు టీ.
నూనె... సరిపడా
కొబ్బరి తురుము... 8 టీ.
పంచదార... వంద గ్రా.
తయారీ విధానం :
పచ్చికోవాను వేడిచేసి అందులో అరకప్పు నీళ్లు కలపాలి. ఆ నీళ్లలోనే గులాబీరంగు కూడా కలపాలి. ఈ కోవాను 15 ముద్దలుగా చేసి పిరమిడ్ ఆకారంలో చుట్టి ఉంచాలి. మందపాటి గిన్నెలో పంచదార వేసి రెండున్నర గ్లాసుల నీళ్లుపోసి స్టవ్‌మీద పెట్టాలి. అది ఓ పొంగు రాగానే దించాలి. ఇందులోనే రోజ్ ఎసెన్స్ కూడా వేసి కలపాలి.
ఓ బాణలిలో నూనె పోసి కాగిన వెంటనే కోవా ముద్దలను వేసి సన్నని మంటమీద ఎర్రగా అయ్యేవరకూ వేయించి తీసి పంచదార పాకంలో వేసి ఉంచాలి. పాకంలో కోవా బాగా నానిన తరువాత తీసి, పంచదారలో దొర్లించి, కొబ్బరి తురుమును చల్లి వడ్డించాలి. అంతే గులాబీ పంతువాలు సిద్ధమైనట్లే..!