కావలసిన పదార్థాలు :
కొబ్బరికాయలు... రెండు
బెల్లం... ఒక కేజీ
బియ్యం... ఒక కేజీ
యాలకులపొడి... ఒక టీస్పూన్
నూనె... ఒక కేజీ
తయారీ విధానం :
బియ్యం నానబెట్టి, కడిగి, వడబోసి పొడిగుడ్డపై ఆరబెట్టాలి. ఆరిన తరువాత బియ్యాన్ని దంచుకోవాలి లేదా మరపట్టించాలి. కొబ్బరికాయల్ని పగులగొట్టి తురిమి ఉంచుకోవాలి. బెల్లాన్ని కూడా సన్నగా తరిగి ఉంచాలి.
ఇప్పుడు బెల్లంలో నీరు పోసి పొయ్యిమీద పెట్టి పాకం పట్టాలి. పాకం వచ్చిన తరువాత దాంట్లో బియ్యంపిండి, యాలకులపొడి, కొబ్బరి వేసి ఉండలు రాకుండా కలుపుకోవాలి.
చల్లారిన తరువాత ఉండలు చేసి కావాల్సిన సైజులో పీటమీద ఒత్తుకుని కాగుతున్న నూనెలో వేయాలి. బాగా ఎర్రగా కాల్చుకుని పేపర్‌పై వేసి నూనె పీల్చుకున్న తరువాత తీసి పాత్రలో ఉంచుకోవాలి. ఇలా తయారు చేసిన బూరెలు తియ్యగా కొబ్బరి తగులుతూ మంచి రుచిగా ఉంటాయి.