కావలసిన పదార్థాలు :
బియ్యం... పావుకేజీ
కొబ్బరిచిప్పలు... రెండు
పంచదార... పావుకేజీ
నెయ్యి... పావుకేజీ
వంటసోడా... అర టీ.
యాలకులపొడి... అర టీ.
తయారీ విధానం :
ముందుగా బియ్యం నానబెట్టి... కొబ్బరితురుముతో కలిపి మెత్తగా, గారెల పిండిలాగా రుబ్బి పక్కన ఉంచాలి. పంచదారలో తగినన్ని నీళ్లుపోసి పొయ్యిమీద పెట్టి లేతపాకం రానివ్వాలి. ఇప్పుడు యాలక్కాయలపొడి, తినే సోడా రెండింటినీ రుబ్బి ఉంచిన పిండిలో వేసి బాగా కలియబెట్టాలి.
ఈ పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసి.. బాగా కాగుతున్న నేతిలో వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. వెంటనే పైన సిద్ధంగా ఉంచుకున్న పాకంలోకి వీటిని వేసేయాలి. అలా మొత్తం పిండినంతా చేయాలి. ఇవి గులాబ్ జామూన్లలాగా పాకాన్ని బాగా పీల్చుకుని తినేందుకు చాలా రుచిగా ఉంటాయి.