కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ... అర కేజీ
జీడిపప్పు... వంద గ్రా.
డాల్డా లేదా నెయ్యి... పావు కేజీ
కిస్మిస్... 50గ్రా.
యాలక్కాయలు... 5గ్రా.
కేసరి కలర్... చిటికెడు
పంచదార... అర కేజీ
ఎండుకొబ్బరి తురుము... ఒక కప్పు
బియ్యం... అర కేజీ
మినప్పప్పు... పావు కేజీ
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
బాణలిలో కొంచెం నెయ్యి వేసి, బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించాలి. జీడిపప్పు, కిస్మిస్, పంచదార, యాలకులపొడి, రంగు వేసి కలిపి ఉంచాలి. విడిగా ఓ గిన్నెలో ఒకటిన్నర లీటర్ల నీళ్లు పోసి మరిగించి రవ్వ మిశ్రమం వేసి బాగా తిప్పాలి. ఇది ఉడికిన తరవాత దించి 20 నిమిషాలు పక్కన పెట్టాలి. కొబ్బరి తురుమును కూడా చేర్చి ఉండలుగా చుట్టాలి.
బియ్యం, మినపప్పుల్ని విడివిడిగా ముందుగానే నానబెట్టి దోసెపిండిలా రుబ్బాలి. ఇందులో కొద్దిగా ఉప్పు కూడా చేర్చాలి. ఇప్పుడు ఒక్కో ఉండను పిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించి తీయాలి. అంతే కేసరి రవ్వ బూరెలు తయారైనట్లే..! వీటిని చల్లారిన తరవాత తింటే చాలా రుచిగా ఉంటాయి.