కావలసిన పదార్థాలు :
తాజా మీగడ పాలు... ఒక లీ.
బియ్యం... ఒక కప్పు
డ్రై యాప్రికాట్‌లు... వంద గ్రా.
బాదం... పావు కప్పు
పిస్తాపప్పు... పావు కప్పు
పంచదార... ఒక కప్పు
కుంకుమపువ్వు... అర టీ.
తయారీ విధానం :
అన్నం ఉడికించి పక్కన పెట్టాలి. బాణలిలో పాలు పోసి సగం అయ్యేదాకా మరిగించాలి. తరువాత అన్నం, డ్రై యాప్రికాట్‌లు, పంచదార వేయాలి. పంచదార కరిగిన తరువాత కుంకుమపువ్వు వేయాలి. కావాలనుకుంటే ఓ రెండు చుక్కలు వెనీలా ఎసెన్స్‌ను కూడా కలుపుకోవచ్చు.
ఇక చివరగా... పై మిశ్రమంలో బాదం, పిస్తా పప్పులను సన్నగా తరిగి కలపాలి. అంతే కుంకుమపువ్వు ఖీర్ రెడీ అయినట్లే..! దీనిని ఆరిన తరువాత ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడిన తరువాత సర్వింగ్ కప్స్‌లో పోసి అతిథులకు సర్వ్ చేయాలి.