కావలసిన పదార్థాలు :
మైదా.. అర కేజీ
డాల్డా.. 200 గ్రా.
తినే సోడా.. ఒక టీ.
నూనె.. తగినంత
బెల్లం.. 300 గ్రా.
యాలకుల పొడి.. ఒక టీ.
నెయ్యి.. 50 గ్రా.
తయారు చేసే విధానం:
మైదా, సోడా, డాల్డాలను సరిపడినన్ని నీళ్లలో చక్కగా కలిపి ముద్దగా చేసుకోవాలి. ముద్దను బల్లమీద మందంగా పరిచి సన్నగా, నిలువు ముక్కలుగా కట్ చేసి నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి. బెల్లాన్ని సరిపడినన్ని నీళ్లతో కలిపి సన్నని సెగపై తీగపాకం పట్టి యాలకుల పొడి, నెయ్యి, వేయించిన మైదా ముక్కలు వేసి విడివిడిగా అయ్యేంతవరకు కలపాలి. అంతే తియ్యటి కాజాలు సిద్ధమైనట్లే..! బెల్లం ఇష్టపడనివారు పంచదారతో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు.