Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కళ్లకు బలాన్నిచ్చే "క్యారెట్ బర్ఫీ"

Advertiesment
వంటకాలు
FILE
కావలసిన పదార్థాలు :
క్యారెట్లు.. అర కేజీ
పంచదార.. 300 గ్రా.
జీడిపప్పు.. 30 గ్రా.
పాలు.. అర లీ.
నెయ్యి.. 50 గ్రా.
పచ్చికోవా.. పావు కేజీ

తయారీ విధానం :
క్యారెట్‌ను సన్నగా తురమాలి. ఒక బాణిలో క్యారెట్ తురుము, పాలు కలిపి ఉడికించాలి. పాలు ఇగిరిపోయాక అందులో నెయ్యి వేసి కాసేపు ఫ్రై చేయాలి. తరువాత దాంట్లోనే పంచదార పోసి మరికాసేపు ఉడికించాలి. ఇలా ఉడికించగా అందులో పాకం వస్తుంది. ఈ పాకం చిక్కబడ్డాక కోవాను పొడిగా చేసి చల్లాలి.

తరువాత అది బాగా దగ్గరికి వచ్చి ముద్దలా అయిన తరువాత దించేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌కు నెయ్యి రాసి.. అందులో పోసి సమంగా సర్దాలి. దానిపై వేయించిన జీడిపప్పులను కూడా వేసి కావాల్సిన సైజులో ముక్కలు కోసుకోవాలి. అంతే నోరూరించే ఎర్రటి క్యారెట్ బర్ఫీ సిద్ధమైనట్లే..! ఓ పట్టు పట్టేద్దామా..?!

Share this Story:

Follow Webdunia telugu