కన్నడిగుల ఫేవరేట్ "మ్యాంగో రసాయనం"
కావలసిన పదార్థాలు : మామిడి పండ్లు... ఒక డజన్బెల్లం.. 500 గ్రాములు ( మామిడి పండ్లు పులుపుంటే ఇంకాస్త ఎక్కువగా బెల్లాన్ని చేర్చుకోవచ్చు)కొబ్బరికాయలు.. రెండుయాలకుల పొడి.. ఒక టీ. తయారీ విధానం :ముందుగా మామిడి పండ్లను శుభ్రం చేసుకుని, వాటిపై గల తొక్కలను తీసుకోవాలి. ఒక పాత్రలో తొక్క తీసిన మామిడి పండ్లను మెత్తగా మెదుపుకోవాలి. మెత్తగా కలిపిన మామిడి పండ్ల మిశ్రమంలో పొడిచేసిన బెల్లాన్ని కలుపుకోవాలి. దీనికి కొబ్బరి పాలు, యాలకుల పొడిని కలుపుకుని బాగా కలియబెట్టుకోవాలి. అంతే.. మ్యాంగో రసాయనం రెడీ.అరగంట సేపట్లో తేలిగ్గా తయారు చేసుకునే ఈ రసాయనం చాలా రుచిగా ఉంటుంది. ఈ పానీయాన్ని చల్లగా తాగాలనుకునే వాళ్ళు ఫ్రిజ్‌లో అరగంట పాటు ఉంచిన తర్వాత జీడిపప్పు. చెర్రీలను పైన అలంకరించుకుని తీసుకోవచ్చు. అలాగే, ఈ మ్యాంగో రసాయనానికి అటుకులను చేర్చి సర్వ్ చేసినట్లైతే మరింత రుచికరంగా ఉంటుంది. మామిడి పండ్ల సీజన్లో కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాల్లోని సముద్ర తీర ప్రాంత ప్రజలు ప్రతి ఇంట్లో ఈ పానీయాన్ని తప్పకుండా చేసుకుంటారు.