సాధారణంగా ఓట్స్ తినడంలో చిన్న పిల్లలు ఆసక్తి చూపరు. ఎందుకంటే అవి తీపిగా ఉండవు కాబట్టి. అయితే బ్రేక్ ఫాస్ట్‌గా ఇవి ఎన్నో పోషకాలిస్తాయి. ఓట్స్‌తో స్వీట్ చేసి పెడితే పిల్లలతో పాటు పెద్దలు కూడా లాగించేస్తారు.
కావలిసిన పదార్థాలు :
ఓట్స్ - అర కప్పు, పాలు - ముప్పావు కప్పు, జీడిపప్పు మిశ్రమం - రెండు స్పూన్లు, నెయ్యి - చేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ (రెడ్ కానీ ఎల్లో కానీ) - చిటికెడు, పంచదార - పావు కప్పు, ఏలక్కాయ పొడి - రెండు చెంచాలు.
తయారు చేయు విధానం :
ముందుగా బాణాలిలో నెయ్యి వేసి జీడిపప్పును వేయించి తీసిపెట్టుకోవాలి. తర్వాత అదే బాణాలిలో ఓట్స్‌ను వేయింతి మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. దీనిని బాణాలిలో వేసి పాలు పోసి బాగా కలపాలి. ఇందులో పంచదార, మిగిలిన నెయ్యి, ఫుడ్ కలర్ కరిగించి, ఏలక్కాయల పొడులను వేసి కలపాలి. మిశ్రమం గట్టి పడుతున్న సమయంలో పైన వేయించిన జీడిపప్పును అలంకరించి దించాలి.