ఎంతో రుచికరమైన పాల చాక్లెట్ టేస్ట్ చేయండిలా..!!
, గురువారం, 19 ఏప్రియల్ 2012 (18:01 IST)
కావల్సిన పదార్థాలు :పాలు - కప్పుపెరుగు - కప్పుపంచదార - కప్పునెయ్యి - చెంచాయాలకులపొడి - కొద్దిగా.తయారీ విధానం : ఒక గిన్నెలో పాలు తీసుకొని బాగా మరిగించాలి. ఆ తరువాత పంచదార, పెరుగు, యాలకులపొడి ఒకదాని తరువాత ఒకటి వేసి మంట తగ్గించి కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా వచ్చిన తరువాత నెయ్యి చేర్చి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. అరచేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని వేడి తగ్గాక ఈ మిశ్రమాన్ని బిళ్లల్లా చేసుకోవాలి. అంతే.. నోట్లో వేసుకోగానే కరిగిపోయే పాల చాక్లెట్ రెడీ. ఇది పిల్లలు బాగా ఇష్టపడి తింటారు.