అనుకోకుండా అతిథులు వస్తే అటుకుల హల్వా చేసేయండి!
, బుధవారం, 12 డిశెంబరు 2012 (17:23 IST)
అనుకోకుండా మీ ఇంటికి అతిథులు వచ్చారా. అయితే వారిని వెంటనే స్వీట్ తయారు చేసి మెప్పించండి. స్వీటా అమ్మో చాలా టైమ్ తీసుకుంటుందే అనుకుంటున్నారా.. అయితే క్విక్గా అటుకుల హల్వా చేసేయండి.కావలసిన పదార్థాలు :అటుకులు : నాలుగు కప్పులుపంచదార : ఒక కప్పు నెయ్యి : 3/4 కప్పు పాలు : రెండు కప్పులు ఏలకుల పొడి : చిటికెడుకుంకుమ పువ్వు : కొంచెం జీడిపప్పు, బాదం, పిస్తా : అరకప్పు తయారీ విధానం :కడాయిలో నూనె పోసి అందులో అటుకులను లేత దోరగా వేయించి పక్కన బెట్టుకోవాలి. మరో పాత్రలో పాలు కాచి అందులో కుంకుమ చేర్చి, ఇందులో వేయించిన అటుకుల్ని వేసి కలపాలి. అటుకుల కాస్త ఉడికాక పంచదార, నెయ్యి చేర్చి కలియబెడుతూ ఉండాలి. జీడిపప్పు, బాదం, పిస్తాలను నేతిలో వేపి హల్వాతో చేర్చి, చివరిగా ఏలకుల పొడి చల్లి దించేయాలి.