Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కృష్ణాష్టమి రోజున భీష్మాచార్యులను పూజిస్తే..?

శ్రీకృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుడినే కాదు.. భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. సంతానం లేనివారు బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే.. సంతానం కలుగుతుంది. అల

Advertiesment
Janmastami
, గురువారం, 30 ఆగస్టు 2018 (12:05 IST)
శ్రీకృష్ణాష్టమి రోజున చిన్ని కృష్ణుడినే కాదు.. భీష్మాచార్యులను పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. సంతానం లేనివారు బాలకృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో పూజిస్తే.. సంతానం కలుగుతుంది.


అలాగే వివాహం కానివారు.. వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయడం వల్ల వారికి వివాహ యోగం కలుగుతుంది. అంతేగాకుండా.. కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో పాటించు. ఫలితాన్ని ఆశించవద్దని చెప్పిన మాటను గుర్తుంచుకుని మానవుడు కలియుగంలో కార్యాచరణ చేపట్టాలి. 
 
కృష్ణునిని జన్మాష్టమి రోజున కృష్ణుని అర్చిస్తే సకల పాపాలు తొలగిపోతాయి. ధర్మార్ధ కామ మోక్ష ప్రాప్తిస్తాయని విశ్వాసం. ఈ రోజున బంగారంతో కానీ, వెండితో కానీ చంద్రబింబాన్ని తయారుచేసి.. వెండి, బంగారు పాత్రలలో దానిని వుంచి పూజించి అర్ఘ్యమిస్తే సకల కోరికలు తీరుతాయని భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తుంది. ఇంకా శ్రీకృష్ణుడి మంచి లక్షణాలని అలవర్చుకోవాలి. ప్రతి విషయంలోను స్వార్థం, ఈర్ష్య, అసూయలను కొంతైన విడనాడి, మానవజన్మకు సార్థకతని ఏర్పరచుకోవాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీకృష్ణాష్టమి రోజున పూజ.. గోదానం చేసిన ఫలితాన్నిస్తుందట..