Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ కృష్ణుడు విశ్వరూపం దాల్చిన సమయాలు...

Advertiesment
శ్రీ కృష్ణుడు విశ్వరూపం దాల్చిన సమయాలు...
WD
"ధర్మం" ఎక్కడ కొలువై ఉంటుందో శ్రీ కృష్ణభగవానుడు.. అక్కడే ఉంటాడని భక్తుల విశ్వాసం. దుష్టశిక్షణార్థం భూలోకమున అవతరించిన శ్రీ కృష్ణుడిని, జన్మాష్టమి రోజున స్తుతించే వారికి సకలసంపదలు చేకూరుతాయని నమ్మకం.

మహిమాన్వితుడైన శ్రీ కృష్ణుడు తన కృష్ణావతారంలో మూడుసార్లు విశ్వరూపం దాల్చాడని పురాణాలు చెబుతున్నాయి.

అందులో కౌరవ సభ ఒకటైతే.. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునునికి గీతోపదేశం చేసే సమయం, దానకర్ణుడు యుద్ధభూమిలో ప్రాణాలను విడిచే సందర్భాన కృష్ణ పరమాత్మ విశ్వరూపమెత్తినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

అందుచేత మానవుని రూపంలో జన్మించి, నవభారత నిర్మాణానికి సూత్రధారి అయిన ఆ దేవదేవుని శ్రీ కృష్ణాష్టమి రోజున ప్రార్థించేవారికి తెలియక చేసిన పాపాలు హరించిపోతాయని పురోహితులు అంటున్నారు.

అంతేగాకుండా.. అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు చేకూరుతాయి. ఇంకా కృష్ణాష్టమి రోజున శ్రీ కృష్ణ నామ స్మరణ, భజన చేసేవారికి వైకుంఠవాసం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu