నెమలి కన్నులు.. నెమలి కన్నులు
బాలకృష్ణుని సిగలో వన్నెలు.
నెమలి కన్నులు,నెమలి కన్నులు బాల కృష్ణుని సిగలో వన్నెలు. సన్న జాజులు,బొండు మల్లెలు తెల్లని వన్నెకు వయ్యారములు పొద్దు తిరుగుడులు,సువర్చలా! ఉదయ భాస్కరుని ఉత్తేజాలు చంద్ర కాంతలు,కువలయమ్ములు చందమామకు "విలాసమ్ములు" విరిసే చిన్నెల గులాబి పువ్వులు చాచా నెహ్రూ కోటున నవ్వులు. -
కుసుమ కుమారి