శ్రీరామనవమినాడు భద్రాద్రిలో ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని చూసేందుకు రెండు కనులు చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ ఉత్సవాన్ని కనులారా వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.
ఇప్పటికే భద్రాచల రామాలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. సుమారు 2 లక్షలకుపైగా భక్తులు భద్రాద్రికి వస్తారని అంచనా.
ఇక శ్రీరామనవమి ప్రత్యేకతను చూస్తే... బెల్లం మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకాన్ని రాములవారికి నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత సేవించడం అత్యంత పుణ్యప్రదం. చలువ పందిళ్లలో శ్రీసీతారాములవారిని కీర్తిస్తూ రామాయణాన్ని పారాయణం చేస్తారు.
సీతారాములతోపాటు లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. భద్రాద్రిలో అత్యంత శోభాయమానంగా వెలుగులు విరజిమ్ముతున్న రామాలయాన్ని వీడియోలో వీక్షించండి.