భద్రాద్రి రామయ్యకు కోటి తలంబ్రాల కోసం ఏకంగా రామదండే వరి చేలో దిగి కోతమొదలు పెట్టిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో చోటుచేసుకుంది.
ఏటా భద్రాద్రి రాముని కల్యాణోత్సవానికి గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించడం శ్రీకృష్ణచైతన్య సంఘం ప్రెసిడెంట్ కళ్యాణం అప్పారావుకు ఆనవాయితీ. ఇందుకు అవసరమైన ధాన్యాన్ని తానే పండిస్తే బాగుంటుందన్న ఆలోచనతో కోరుకొండ-గోకవరం మధ్య కొంత పొలంలో వరి సాగుచేశారు.
కోతకు వచ్చిన పంటలోంచి కొన్ని కంకులను కోసి అటుగా వచ్చిన శ్రీవారి రథయాత్రకు కానుకగా అందజేశారు. కోతకు వచ్చిన పంటను కోసేందుకు కూలీలకు హనుమంతుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు వంటి వేషాలు వేయించి, శ్రీరామ నామాన్ని జపిస్తూ పైరును కోయించారు.