Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వింబుల్డన్‌ నేటి నుంచే: టాప్ సీడ్ల మధ్య హోరాహోరీ పోరు!

Advertiesment
వింబుల్డన్‌ నేటి నుంచే: టాప్ సీడ్ల మధ్య హోరాహోరీ పోరు!
, సోమవారం, 25 జూన్ 2012 (09:57 IST)
FILE
ప్రతిష్టాత్మక వింబుల్టన్ టెన్నిస్ టోర్నమెంట్ సోమవారం నుంచి జరుగనుంది. టైటిల్ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో టాప్ సీడ్లు బరిలోకి దిగుతున్నారు. నోవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ తమ తమ ప్రత్యర్థులపై ఆధిపత్యాన్ని చాటుకుని గెలుపును నమోదు చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.

జకోవిచ్, నాదల్‌ల జోరుకు బ్రేక్ వేయాలనే లక్ష్యంతో రోజర్ ఫెదరర్ ఏడున్నర దశాబ్దాల ‘గ్రాండ్‌స్లామ్’ టైటిల్ నిరీక్షణకు తెరదించాలనే సంకల్పంతో ఆండీ ముర్రే తహతహలాడుతున్నారు.

గత ఆరేళ్లుగా పురుషుల టెన్నిస్‌ను శాసిస్తున్న ఫెడరర్, నాదల్, జొకోవిచ్‌లు ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్స్‌గా బరిలోకి దిగుతున్నారు. అందని ద్రాక్షగా ఊరిస్తున్న ‘గ్రాండ్‌స్లామ్’ టైటిల్‌ను అందుకోవాలని బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే మరోసారి ప్రయత్నించనున్నాడు.

మొత్తం కోటి 60 లక్షల 60 వేల పౌండ్ల (రూ. 142 కోట్లు) ప్రైజ్‌మనీ గల వింబుల్డన్ టోర్నీలో పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలకు 11 లక్షల 50 వేల పౌండ్ల (రూ. 10 కోట్ల 23 లక్షలు) చొప్పున లభించనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu