Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పట్టాయ ఓపెన్‌లో సానియా: సింగిల్స్ నిరాశ.. డబుల్స్‌లో సెమీస్‌

Advertiesment
పట్టాయా ఓపెన్
, శనివారం, 11 ఫిబ్రవరి 2012 (11:04 IST)
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సింగిల్స్‌లో మరోసారి నిరాశపరచింది. పట్టాయ ఓపెన్‌లో శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనీస్‌ క్రీడాకారిణి తాపీ క్వాలీఫయర్ సూవే సియో చేతిలో 5-7,3-6 తేడాతో ఓటమి పాలైంది.

ప్రపంచ 111 ర్యాంక్‌తో బరిలోకి దిగిన సానియాను మంచి ఊపుమీదున్న సూవే సియో అద్భుతమైన షాట్లతో గంట ఇరవై నిమిషాల్లో విజయం సాధించింది.

కాగా సానియా డబుల్స్ విభాగంలో సెమీ ఫైనల్‌లోకి ప్రవేశించింది. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియా క్రీడాకారిణి అనస్తేసియా రొదియానొవాతో జత కట్టిన సానియా 6-4,6-3 తేడాతో టాప్ సీడ్ థాయిలాండ్ జంట వరస్తయ-వరుణ్య వాంగ్తేన్చయ్‌పై ఘన విజయం సాధించి సెమీ ఫైనలోకి ప్రవేశించారు.

ఈ ఇండో-ఆసీస్ జంట సెమీ ఫైనలో మూడో సీడ్ అక్గుల్ అమన్‌మురదొవా(ఉజ్బెకిస్థాన్)- కిమికొ డాటెక్రమ్న్(జపాన్) జోడితో తలపడనుంది.

Share this Story:

Follow Webdunia telugu