Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

థామస్ కప్‌లో : శుభారంభం చేసిన భారత జట్టు

Advertiesment
థామస్ కప్
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2012 (11:50 IST)
ప్రతిష్టాత్మక థామస్ కప్‌లో ఆసియా జోన్ పిలిమినరీ రౌండ్‌లో భాగంగా సోమవారం జరిగిన గ్రూప్-బి పోరులో భారత్ 3-2 తేడాతో సింగపూర్‌పై ఘనవిజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో పారుపల్లి కశ్యప్ 21-16, 21-19 తో సింగపూర్‌కు చెందిన లియాంగ్ డెరెక్ వాంగ్‌పై గెలిచి భారత్‌కు శుభారంభం అందించాడు.

అనంతరం జరిగిన డబుల్స్‌ రౌండ్లో భారత్ జోడి రూపేశ్ కుమార్- సనావే థామస్‌లు 21-8, 21-15 తేడాతో జియాంగ్ యెవొ- లూయి పై విజయం సాధించి భారత్ ఆధిక్యాన్ని2-0కి పెంచారు. ఐతే మరో సింగిల్స్‌లో సౌరభ్ వర్మ 20-22, 16-21తో యాంగ్ జావో చెన్ చేతిలో పరాజయంతో సింగపూర్ భారత్ ఆధిక్యాని 1-2కు తగ్గించింది.

మరో డబుల్స్‌ రౌండ్లో అక్షయ్ దివాల్కర్-ప్రణవ్ చోప్రా 21-19, 21-16తో చయుత్ త్రయాచార్త్-జెఫ్రీ వాంగ్‌ జోడిపై విజయం సాధించి భారత్ ఆధిక్యాని 3-1కి పెంచారు. కాగా చివరి నామమాత్రమైన సింగిల్స్ మ్యాచ్‌లో భారత్‌కు చెందిన ఆనంద్ పవార్ 14-21, 21-6, 18-21తో చావో హువాంగ్ చేతిలో పోరాడి ఓడిపోయాడు. కాని ఈ ఓటమి భారత్‌పై ప్రభావం పడలేదు.

దీనితో సింగపూర్‌పై భారత్ ఆధిక్యం 3-2తో క్వార్టర్ ఫైనల్‌లో ఆడే అవకాశాలు మెరుగైనాయి. గ్రూప్-బిలో భారత్‌తో పాటు ఇండోనేషియా, సింగపూర్, మకావ్ (చైనా) జట్టున్నాయి. మంగళవారం బలహీనమైన మకావ్‌ జట్టుపై విజయం సాధిస్తే క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించినట్లే.

Share this Story:

Follow Webdunia telugu