Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌: అగ్రస్థానాన్ని ఆక్రమించిన వోజ్నియాకీ

డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌: అగ్రస్థానాన్ని ఆక్రమించిన వోజ్నియాకీ
ప్రపంచ టెన్నిస్ సమాఖ్య సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకుల పట్టికలో వోజ్నియాకీ తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన కిమ్ క్లిజెస్టర్‌ నుంచి వోజ్నియాకీ తిరిగి కైవసం చేసుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన దుబాయ్ ఓపెన్ టోర్నీలో స్వెత్లానా కుజెంత్సోవాపై 6-1, 6-3 స్కోరుతో గెలుపొందింది. ఈ విజయంతో తన కెరీర్‌లో 13వ టైటిల్‌ను దక్కించుకుంది.

గడచిన వారం రోజుల వ్యవధిలో కుజెంత్సోవాపై డెన్మార్క్ సుందరి పైచేయి సాధించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. యూఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో మంచి ప్రదర్శననే కనపరిచింది. ప్రత్యర్థి సర్వీస్‌ను 2-0తో బ్రేక్ చేసిన వోజ్నియాకీ.. ఆ తర్వాత విభిన్నమైన ఆటతీరుతో ఆకట్టుకుంది.

Share this Story:

Follow Webdunia telugu