Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

క్రీడలను ప్రోత్సహిస్తున్న ఘనత మా ప్రభుత్వానిదే: ఎంపీ బీబీ పాటిల్‌

Advertiesment
Zaheerabad Lok Sabha MP BB Patil
, మంగళవారం, 24 నవంబరు 2015 (12:43 IST)
క్రీడలకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరుగుతున్న సబ్‌జూనియర్‌ జాతీయ వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను ఆయన సందర్శించి, ఆంధ్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల బాలుర జట్ల మధ్య జరుగుతున్న పోటీలను తిలకించారు. 
 
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాటిల్‌ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. సానియా మీర్జా లాంటి వారి సేవలను గుర్తించిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎంతో మంది క్రీడాకారులను సీఎం కేసీఆర్‌ ఆర్థికంగా ఆదుకున్నారని గుర్తుచేశారు. 
 
ఆ తర్వాత వాలీబాల్‌ సంఘం జిల్లా అధ్యక్షులు మురళీయాదవ్ మాట్లాడుతూ నర్సాపూర్‌లో జాతీయ పోటీలు చేపట్టడం ఆనందంగా ఉందన్నారు.ఇందుకు సహకారం అందిస్తున్న బీవీఆర్‌ఐటీ ఛైర్మన్‌ విష్ణురాజుకు రుణపడి ఉంటామన్నారు. శివ్వంపేట జడ్పీటీసీ కమల, నర్సాపూర్‌ సర్పంచి వెంకటరమణారావు తదితరులు మాట్లాడారు.

Share this Story:

Follow Webdunia telugu