సాయ్ కేంద్రంలో అత్యాచార పర్వం: పెళ్లి చేసుకుంటానని.. మూడేళ్ల పాటు అత్యాచారం.
సాయ్ కేంద్రంలో అత్యాచార పర్వం వెలుగు చూడటం సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.. తోటి క్రీడాకారిణిపై మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన ఓ క్రీడాకారుడి బాగోతం బట్టబయలైంది. స్పోర్ట్స్ అథా
సాయ్ కేంద్రంలో అత్యాచార పర్వం వెలుగు చూడటం సంచలనం సృష్టించింది. పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.. తోటి క్రీడాకారిణిపై మూడేళ్ల పాటు అత్యాచారానికి పాల్పడిన ఓ క్రీడాకారుడి బాగోతం బట్టబయలైంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాతిబాద్ ప్రాంతంలోని సాయ్ కేంద్రంలో శిక్షణ కోసం 2013లో బాధితురాలు చేరింది.
అయితే పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి మూడేళ్ల పాటు తోటి క్రీడాకారుడే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేయడంతోపాటు దాన్ని వీడియో చిత్రీకరించాడని క్రీడాకారిణి పోలీసులకు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొంది.
బాధితురాలైన క్రీడాకారిణి రోహతక్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాన్ని దర్యాప్తు చేసేందుకు వీలుగా రాతిబాద్ పోలీసుస్టేషనుకు కేసును బదిలీ చేశారు. క్రీడా శిక్షణ ముగిశాక పెళ్లాడేందుకు నిరాకరించడంతో క్రీడాకారిణి తోటి క్రీడాకారుడే తనపై అత్యాచారం జరిపాడని ఫిర్యాదు చేసిందని పోలీసులు వెల్లడించారు.