Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాలుగున్నర నెల గర్భంతో వింబుల్డన్ టెన్నిస్ ఆడిన మాండీ మినెల్లా

నాలుగున్నర నెల గర్భంతో టెన్నిస్ స్టార్ మాండీ మినెల్లా వింబుల్డన్ టెన్నిస్ ఆడింది. వింబుల్డన్ టెన్నిస్ పోటీలు ఆసక్తికరంగా జరుగుతున్న నేపథ్యంలో లక్సెంబర్గ్‌కు చెందిన మాండీ మినెల్లా.. గర్భంతో ఉన్నప్పటికీ

Advertiesment
నాలుగున్నర నెల గర్భంతో వింబుల్డన్ టెన్నిస్ ఆడిన మాండీ మినెల్లా
, బుధవారం, 5 జులై 2017 (09:00 IST)
నాలుగున్నర నెల గర్భంతో టెన్నిస్ స్టార్ మాండీ మినెల్లా వింబుల్డన్ టెన్నిస్ ఆడింది. వింబుల్డన్ టెన్నిస్ పోటీలు ఆసక్తికరంగా జరుగుతున్న నేపథ్యంలో లక్సెంబర్గ్‌కు చెందిన మాండీ మినెల్లా.. గర్భంతో ఉన్నప్పటికీ టెన్నిస్ కోర్టులో ప్రత్యర్థితో పోటీపడింది. దీంతో ఆమెకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 
 
యూరోపియన్ యూనియన్‌లో ఉన్న ఓ చిన్న దేశం లక్సెంబర్గ్. ఈ దేశానికి చెందిన 31 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారిణి మాండీ మినెల్లా.. ప్రస్తుతం నాలుగున్నర నెల కడుపుతో వుంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో వింబుల్డన్ కోర్టులో టెన్నిస్ ఆడుతోంది. 
 
సింగిల్స్, డబుల్స్ పోటీల్లో ఆడుతున్న మాండీ మినెల్లా.. మంగళవారం సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో ఇటాలీకి చెందిన ఫ్రాన్సెస్కో‌తో తలపడింది. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగి.. ప్రత్యర్థితో నువ్వా నేనా అని పోటీ పడిన మినెల్లా 1-6, 1-6 వరుస సెట్ల తేడాతో పరాజయం పాలైంది.
 
దుస్తులు బిగుతుగా కాకుండా.. వదులుగా ధరించడంతోనే ఈ మ్యాచ్‌లో మినిల్లా ఓడిపోయింది. అయితే తాను గర్భంగా ఉన్నట్లు చెప్తున్న ఓ ఫోటోను మినెల్లా ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఇప్పటికే అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గర్భంతోనే టెన్నిస్ ఆడిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీమ్‌కే చేతగాని చోట ధోనీమీద పడితే ఏం లాభం.. కసురుకున్న గవాస్కర్