Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రింగ్‌లో డ్రాగన్ కోరలు పీకేసిన విజేందర్ : ఇండో-చైనా బోర్డర్‌లో శాంతి నెలకొల్పాలని పిలుపు

భారత బాక్సర్ విజేందర్ సింగ్ డ్రాగన్ కోరలు పీకేశాడు. చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైతియాలిని ఓడించి విజేతగా నిలిచాడు. 96-93, 95-94, 95-94 తేడాతో జుల్ఫికర్‌ను ఓడించి భారత సత్తాను మరోసారి చాటాడు. వరుసగా తొమ్

Advertiesment
రింగ్‌లో డ్రాగన్ కోరలు పీకేసిన విజేందర్ : ఇండో-చైనా బోర్డర్‌లో శాంతి నెలకొల్పాలని పిలుపు
, ఆదివారం, 6 ఆగస్టు 2017 (11:53 IST)
భారత బాక్సర్ విజేందర్ సింగ్ డ్రాగన్ కోరలు పీకేశాడు. చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైతియాలిని ఓడించి విజేతగా నిలిచాడు. 96-93, 95-94, 95-94 తేడాతో జుల్ఫికర్‌ను ఓడించి భారత సత్తాను మరోసారి చాటాడు. వరుసగా తొమ్మిదో సారి విజయం సాధించి తానే బాక్సింగ్ చాంపియన్‌ను అని మరోసారి చాటుకున్నాడు.
 
ఈ ఫైట్‌లో తొలి ఐదు రౌండ్లలో ఆధిపత్యం ఉన్నా ఆ తర్వాత రెండు రౌండ్లలో విజేందర్ డీలా పడ్డాడు. కానీ చివరిదాకా పోరాడి సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. తద్వారా డబ్ల్యూటీవో ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్, ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో చైనా సరిహద్దు గోడలను బద్ధలు కొట్టినంతపని చేశాడు. 
 
ఇండో-చైనా బోర్డర్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో బౌట్‌కు మంచి ప్రాచుర్యం లభించింది. చైనా బాక్సర్‌పై విజేందర్‌ కసిగా పంచ్‌ల వర్షం కురిపిస్తుంటే.. సంబరాలు చేసుకోవాలని ప్రతి భారతీయుడూ హర్షించాడు. కానీ విజేందర్‌ (32) కంటే 9 ఏళ్లు చిన్నవాడైన జుల్పికర్‌.. రింగ్‌లో మాత్రం గట్టిపోటీ ఇచ్చాడు. 10 రౌండ్ల పోరులో సింగ్‌ కంటే మెరుగైన ప్రదర్శన చేసినట్టు కనిపించినా.. ఫౌల్స్‌ కారణంగా మూల్యం చెల్లించుకున్నాడు. 
 
ఈ విజయం తర్వాత విజేందర్ స్పందిస్తూ.. ఇండో-చైనా బోర్డర్‌లో ఉద్రిక్తతను తగ్గించి.. శాంతిని నెలకొల్పండి. జుల్పికర్‌ ఓడిన డబ్ల్యూబీఓ ఓరియంటల్‌ సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ టైటిల్‌ బెల్ట్‌ను అతడికే తిరిగి ఇచ్చేయాలని అనుకుంటున్నా. చైనా ఉత్పత్తులు ఎక్కువ కాలం నిలబడవనుకున్నా. కానీ జుల్పికర్‌ పోరాడిన తీరు ఆశ్చర్యపరిచింది. 5-6 రౌండ్లలో పోరు ముగుస్తుందనుకున్నా. నా వ్యూహానికి తగ్గట్టు ఆడలేదు. బెల్ట్‌ కింద తగలడంతో ఇబ్బంది పడినట్టు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బైక్‌పై తిరగలేనంతగా గుర్తుపడుతున్నారు.. పెళ్లి మరో ఐదేళ్లు వాయిదా: మిథాలీ రాజ్